Sunday 1 April 2012

ఎంబ్రాయిడరి కుట్లు-కావలసినవి-2



ఈ శిర్షికలో ఇంతకు ముందు చెప్పుకున్నవి ఈ లింక్ లో చూడండి:


2. Needles--సూదులు 

సూదులే కాదా అని అంత తేలిక అనుకోవద్దు. వాటి గురించి మనం కొంతైన తెలుసుకోవాలి. చేతి కుట్లు అల్లికలు అనేక రకాలు ఉన్నాయి. అలాగే ఎంబ్రాయిడరి కుట్లు కూడా ఎన్నో రకాలు. కుట్లకి కాని అల్లికకి కాని సూది చాల అవసరం. సరి అయిన సూది కాకా పొతే మనం చేసే దంతా వృధా.

ఇప్పుడు సూదుల గురించి కొన్ని సంగతులు తెలుసుకుందామా?

(అ) సైజు: సూదుల సైజును బట్టి నంబరు ఉంటుంది. అయితే ఎంత పెద్ద నెంబర్ ఐతే అంత సన్నని మరియు పొట్టి సూది. మనం చేసే వర్క్ ని బట్టి సూదిని ఎంచుకోవాలి.

(ఆ) పొడుగు: 22 mm నుండి 71.4 mm దాక ఉంటాయి. ఇంకా పొడవు ఉండవచ్చు.

(ఇ) వెడల్పు: సూది వెడల్పు మొత్తం అంతా ఒకటే ఉండవచ్చును లేదా కొన్ని చోట్ల వెడల్పు కొన్ని చోట్ల సన్నంగాను ఉండవచ్చు. అవి ఎలా అనేది మనం సూదుల రకాలలో చూద్దాం.

(ఈ) సూది మొన: చాల సన్నగా పదునుగా ఉండవచ్చు లేదా మొద్దుగా ఉండవచ్చు. సూదుల రకాలలో చూడండి.

(ఉ) సూది రంధ్రము: ఇవి, గుండ్రంగా, పొడువుగా మరుయు సెల్ఫ్ థ్రెడింగ్ సూదులుకి వేరుగా ఉంటుంది. కొన్ని రెండు రంధ్రాలు ఉన్నవి కూడా ఉంటాయి. 

ఇప్పుడు మనం సూదులలో వివిధ రకాలను గురించి తెలుసుకుందాం:
  • క్రుఅల్ లేక ఎంబ్రాయిడరి సూదులు (Crewel/Embroidery) : మనం మాములుగా వాడేవి ఇవే. మీడియం సైజ్ ఉండి, సూటిగా పదునైన సన్నని మొన, పొడవాటి రంధ్రం కలిగి ఉంటాయి. వివిధ సైజ్ లలో ఉండి ఎక్కువ పోచల దారం దూర్చే విధంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల సర్ఫేసు ఎంబ్రాయిడరి కి పనికి వస్తాయి. 
  • షార్ప్స్(Sharps): ఇవి పేరుకు తగ్గట్టుగా చాల పదునైన సన్నటి మొన, మీడియం సైజ్, గుండ్రటి రంధ్రం కలిగి ఉంటాయి. ఇవి మాములుగా చేతితో కుట్టేందుకు వాడతారు. 
  • షెనీల్ (Chenille): లావుగా బలంగా పొడువాటి పెద్ద రంధ్రం కలిగి, మొన పదునుగా ఉంటుంది.
  • టెపెస్ట్రి (Tapestry): పెద్ద రంధ్రం కలిగి, సూది లావుగా, మొన మొద్దుగా ఉంటుంది. 6 లేక ఎక్కువ పోచల లావు దారం కానీ, వూల్ కానీ కుట్టటానికి పనికొస్తాయి. ఇవి ఎక్కువగ క్రాస్ స్టిచ్/ టెపెస్ట్రి వర్క్ కోసం వాడతారు. వదులుగా/దూరంగా నేత కలిగిన అంటే మ్యాటి లాంటి వాటికోసం పనికొస్తాయి. 
  • స్ట్రా లేక మిలినర్ (Straw/Milliners) : ఇవి మొత్తం అంతా ఒకటే వెడల్పు కలిగి సన్నగా చాలా పొడువుగా ఉంటాయి. బులియన్ స్టిచ్ కి బాగా పనికొస్తాయి. 
  • బీడింగ్ (Beading): ఇవి పూసలు కుట్టటానికి పనికొస్తాయి. చాలా సన్నగా పొడువుగా ఉంటాయి. 
  •  ఈజీ థ్రెడింగ్ (Easy Threading): దారం సుళువుగా ఎక్కించుకోటానికి వీలుగా ఉంటాయి. వీటికి రెండు రంధ్రాలు ఉంటాయి. 

ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. మనం వాడే బట్ట, దారాలు, కుట్టే కుట్టు విటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సూదిని ఎంచు కోవాలి. అది అనుభవం మీద మనకే తెలుస్తుంది. 
ఇవి assorted అంటే రక రకాలైన సూదులు ఒకే ప్యాక్ లో ఉంటాయి.

ఇవి రిపైర్ కి వాడేవి. 

ఐతే కుట్లు అల్లికలు ఎక్కువగా చేసే వారు, అన్ని రకాలవి ఒకొక్క ప్యాక్ అయిన కొని పెట్టుకుంటే బాగుంటుంది.

మరి కొన్ని విషయాలు వచ్చే టపాలలో.....



మీ...అనామిక....

No comments: