Friday 23 March 2012

రంగవల్లి -50

ఉగాది పండుగ ప్రత్యేకం

ఉగాది పచ్చడి -వగరు పులుపు కలిసిన మామిడి కాయలు, వేపపువ్వు, చింత పండు, బెల్లం, పచ్చి మిరపకాయలు, మిరియాలు చెరుకు ముక్కలు కొత్త కుండ ఇవన్ని పచ్చడికి కావలసినవి. కొన్ని ప్రాంతాలలో ఉగది రోజున కొత్త కుండలో నీరు పోసి దానితో పచ్చడికి వాడతారు. ఈ రోజు నుంచి వేసవి కాలమంతా  ఆ కుండను నీళ్ళకి వాడతారు. 

షడ్రుచుల కలయిక ఈ ఉగాది పచ్చడి. నాకైతే చాల ఇష్టం. అందుకే ఇలా ఈ రంగవల్లి వేయలనిపించిది. 

పండుగ కదా పళ్ళెంలో మిఠాయిలు కూడా ఉన్నాయి.

21 నుండి 1 సరి  చుక్కలు. మీకు నచ్చిందనుకుంటాను

మీరు ఒకసారి వేసి చూడండి....


మీ...అనామిక....

2 comments:

రసజ్ఞ said...

షడ్రుచులని షడ్రంగులలో (ఆరు రంగులనిలెండి) చూపించేశారు! బాగుంది ఈ ముగ్గు! ఉగాది శుభాకాంక్షలు!

అనామిక... said...

ధన్యవాదలు రసఙ్ఞ. మీకూ ఉగాది శుభకాంక్షలు