Saturday 7 January 2012

ఎంబ్రాయిడరి డిజైన్

కుట్లు అల్లికలు నేర్చుకుందాం అని మొదలు పెట్టాము. మరి వాటికోసం ఎంబ్రాయిడరి డిజైన్లు కావలిగా. అందుకనే ఈ శిర్షిక లో వారానికి ఒకటి మీ కోసం. 
నాకు చిన్నప్పటి నుండి, ఏదైనా అందమైన డిజైన్ చూడగానే, దానిని వెంటనే ఒక పేపర్ మిద గీసుకుని దాచుకోవటం అలవాటు. అలాగే, పత్రికలలో వచ్చిన డిజైన్ కత్తిరించి దాస్తాను. 

చీరెల మిద, గుడిలో రాతి పై చెక్కుడు లేక ఇంకెక్కడైన చూసినవి  గుర్తున్నంత వరకు గిసి పెట్టుకుంటాను. నాతొ ఎప్పుడు ఒక చిన్న స్కెచ్  పాడ్  పెన్సిల్ ఉంటాయి. తరువాత వాటిని చూసి మార్పులు చేసి ఇంకా అందంగా వేయటము, కోత్తవైన డిజైన్లు గీయటము  చేస్తూ ఉంటాను. ఇలా భద్రపరచిన డిజైన్లు ఎంబ్రాయిడరి/పేయింట్ చేయాటానికి పనికి వస్తాయి. ఇలా చాలా ప్రోగు చేశాను. 

పైన ఇచ్చిన డిజైన్ పిల్లల దుస్తుల మీద, రుమాళ్ళు, తువాళ్ళు, కుషన్ కవర్,  టేబుల్ క్లాత్, టేబుల్ మ్యాట్, గ్రీటింగ్ కార్డ్లు , దిండు గలీబులు, దుప్పట్లు  ఇలా చాలా వాటి పై ఎంబ్రాయిడరి/పేయింట్ చేసుకోవచ్చు.

రన్నింగ్, కాడ, గొలుసు, ముద్ద కుట్లు, పువ్వుల కోసం ముడి కుట్లు వాడవచ్చు. చిన్ని చిన్ని పూసలను వాడవచ్చు. 

చూస్తూ ఉండండి నా బ్లాగ్ మరిన్ని డిజైన్ల కోసం...వారం వారం.....  



మీ...అనామిక....

No comments: