Tuesday 24 January 2012

హలో

హలో. ఈ మధ్యన నేను బిజీగా ఉండి టపాలు రాయలేక  పోయాను. అందులో తెలుగులో రాయటమంటే కష్టమే.  అయిన నేను పట్టుదలగా తెలుగు లోనే  రాయాలని అనుకుంటున్నాను. 

రక రకాలైన కుట్లు అల్లికల టపాలు త్వరలో. మరి మీరు వాటికి కావలసినవి రెడీగా పెట్టుకొండి.






మీ...అనామిక....

Tuesday 17 January 2012

రంగవల్లి-47

రథం ముగ్గులు 


ఈ ముగ్గులు Xలు పెట్టి  కలుపుకోవాలి.చాల సులభంగా వేసుకోవచ్చు. ఎంత పెద్దవి కావాలంటే అంత పెంచుకుని వేసుకోవచ్చు. రథ సప్తమికి కూడా ఈ రథాల ముగ్గులు వేస్తారు.


మీ...అనామిక....

Monday 16 January 2012

సంక్రాంతి శుభాకాంక్షలు


Wishing you all a very Happy, Prosperous and Funfilled Makar Sankranti, Pongal and Lohri to all my friends

అందరికి  నా సంక్రాంతి శుభాకాంక్షలు.....


మీ...అనామిక....

Saturday 14 January 2012

రంగవల్లి-46


సంక్రాంతి సంబరాలు:



19X19 చుక్కలు. పొంగలి కుండలు, మిఠాయిలు, గాలి పటాలు, చెఱుకు గడలు, ముత్యాల ముగ్గులు, గొబ్బిళ్ళు అంతా పండగ సందడే...

మీ...అనామిక....

Friday 13 January 2012

రంగవల్లి -45

రథం ముగ్గు 


ఇది చుక్కలు లేకుండా గీసినది . 

మీ...అనామిక....

రంగవల్లి -44

రథం ముగ్గులు 

ఇంకొన్ని రథం ముగ్గులు. ఇవి చుక్కలు లేకుండా గీతలతో వేసినవి.




మీ...అనామిక....

Wednesday 11 January 2012

రంగవల్లి-43

సంక్రాంతి ముగ్గ్లులు 
25 చుక్కలు --3 వరుసలు 
23, 21, ....3 వరకు ఎదురు చుక్క.

పొంగలి కుండలు, గాలి పటాలు, గొబ్బిళ్ళు, చెరుకు గడలు, ముగ్గులు, భోగి మంటలు - అదే కదా పండుగ సందడి...వచ్చేస్తోందండి సంక్రాంతి పండుగ ...మరిన్ని ముగ్గులు తరువాతి టపాలలో...

చూస్తూ ఉండండి....

మీ...అనామిక....

Sunday 8 January 2012

రంగవల్లి-38

నెల ముగ్గులు 

ఇవి దారుల ముగ్గులు, భోగి, పండుగనాడు వేసేవి.

ఇవి ఒక చిన్న భాగం మాత్రమే విడిగా ఇచ్చాను. ఇలాంటివి కొన్నిటిని కలిపి పెద్దవి క్లిష్టంగా ఉన్న ముగ్గులు వేస్తారు. పెద్ద ముంగిలి ఉన్నవారు చాల పెద్ద ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులలో కొన్ని దారులను, ముసి, కొన్నిటిని తెరిచి ఉంచుతారు. చాల గజి బిజిగా అనిపిస్తుంది. అసలు అలాంటి  ముగ్గులు వేయటానికి చాల నేర్పు ఓర్పు కావలి. 

ఇంకా కొన్ని తరువాతి టపాలలో 


మీ...అనామిక....

రంగవల్లి-37





మీ...అనామిక....

రంగవల్లి-36

నెల ముగ్గులు 




మీ...అనామిక....

రంగవల్లి-35

కూరగాయల ముగ్గు 


13X1 ఎదురు  చుక్క. పైన చూపిన విధంగా కలపండి. కాకరకాయలు వంకాయలు కనువిందు చేస్తాయి. 

మీ...అనామిక....

రంగవల్లి-34


చేపల ముగ్గు

13X1 ఎదురు  చుక్క .

మీ...అనామిక....

రంగవల్లి-33


13 X 1 చుక్కలు --ఎదురు చుక్క.


మీ...అనామిక....

Saturday 7 January 2012

రంగవల్లి-32

నెల ముగ్గులు 


సంక్రాంతికి వేసే నెల ముగ్గులలో ఇది ఒకటి. స్వస్తిక మధ్యలో వేసి, చుట్టురా డిజైన్ వేసుకోవచ్చు. ఇది నేను చాలా సింపుల్ గావేసిన ముగ్గు. దీనినే ఇంకా చుట్టురా డిజైన్ వేసి పెద్దది చేసికోవచ్చును. 

మరి కొన్ని తరువాతి టపాలలో......


మీ...అనామిక....

ఎంబ్రాయిడరి డిజైన్

కుట్లు అల్లికలు నేర్చుకుందాం అని మొదలు పెట్టాము. మరి వాటికోసం ఎంబ్రాయిడరి డిజైన్లు కావలిగా. అందుకనే ఈ శిర్షిక లో వారానికి ఒకటి మీ కోసం. 
నాకు చిన్నప్పటి నుండి, ఏదైనా అందమైన డిజైన్ చూడగానే, దానిని వెంటనే ఒక పేపర్ మిద గీసుకుని దాచుకోవటం అలవాటు. అలాగే, పత్రికలలో వచ్చిన డిజైన్ కత్తిరించి దాస్తాను. 

చీరెల మిద, గుడిలో రాతి పై చెక్కుడు లేక ఇంకెక్కడైన చూసినవి  గుర్తున్నంత వరకు గిసి పెట్టుకుంటాను. నాతొ ఎప్పుడు ఒక చిన్న స్కెచ్  పాడ్  పెన్సిల్ ఉంటాయి. తరువాత వాటిని చూసి మార్పులు చేసి ఇంకా అందంగా వేయటము, కోత్తవైన డిజైన్లు గీయటము  చేస్తూ ఉంటాను. ఇలా భద్రపరచిన డిజైన్లు ఎంబ్రాయిడరి/పేయింట్ చేయాటానికి పనికి వస్తాయి. ఇలా చాలా ప్రోగు చేశాను. 

పైన ఇచ్చిన డిజైన్ పిల్లల దుస్తుల మీద, రుమాళ్ళు, తువాళ్ళు, కుషన్ కవర్,  టేబుల్ క్లాత్, టేబుల్ మ్యాట్, గ్రీటింగ్ కార్డ్లు , దిండు గలీబులు, దుప్పట్లు  ఇలా చాలా వాటి పై ఎంబ్రాయిడరి/పేయింట్ చేసుకోవచ్చు.

రన్నింగ్, కాడ, గొలుసు, ముద్ద కుట్లు, పువ్వుల కోసం ముడి కుట్లు వాడవచ్చు. చిన్ని చిన్ని పూసలను వాడవచ్చు. 

చూస్తూ ఉండండి నా బ్లాగ్ మరిన్ని డిజైన్ల కోసం...వారం వారం.....  



మీ...అనామిక....

Friday 6 January 2012

రంగవల్లి-31

కలువల సరస్సు 


27---9 వరుసలు 
25, 23, 21..........9 వరకు 
3  చుక్కలు  అన్ని వైపులా.


మీ...అనామిక....