Saturday 31 December 2011

రంగవల్లి-25

దేవుని విస్తరి 
19 X10 చుక్కలు మధ్య చుక్క.


మధ్యలో ఉన్న డిజైన్ ని విస్తరాకు అంటారు.ఇది మనందరికీ సుపరిచితమే. శుభకార్యాలలో కానీ, విందులలో కాని మన ఉళ్ళలో దీనినే కదా భోజనానికి వాడతాము. పర్యావరణానికి ఎంతో మేలు. ప్లాస్టిక్ విస్తళ్ళు కన్నా రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యము.


దానిని చుట్టి ఉన్నది ఒక 6 కోణాలు కలిగిన స్టార్ డిజైన్. ఇది శ్రీ చక్రానికి ప్రతీక. 


చుట్టురా ఉన్నవి మూడు దళాలు -మారేడు దళాలు లేక బిల్వ దళాలు . మూడు దళాలు  శివుని త్రిశులానికి ప్రతీక అని అంటారు. శివునికి ఇవి ఎంతో ప్రీతికరమైనవి. అందుకే స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి బిల్వ దళ పూజ చేస్తారు.  


ఈ దళాల లో లక్ష్మి నివాసముంటుందని కూడా అంటారు. వీటితో అమ్మవారికి దేవి నవ రాత్రులలో పూజ చేస్తే అమ్మకి ఇష్టం అని కూడా అంటారు. 


ఇన్ని చిహ్నాలు కలిగిన ఈ ముగ్గుకి దేవుని విస్తరి అని పేరు పెట్టాను. పరమైన రోజులలో, పండుగలలో కొందరు నిత్యమూ తాము వండుకున్నది దేవునికి సమర్పించి కాని తినరు.అదే దేవుని విస్తరి. 


ఈ ముగ్గు వేయటము సులభమే.చుక్కలు దూరంగా పెట్టుకుంటే ముగ్గు పెద్దగా కనిపిస్తుంది. 


మరి వేసి చూడండి...

మీ...అనామిక....

No comments: