Monday 19 December 2011

రంగవల్లి -12

నెల ముగ్గులు


మన రాష్ట్రంలో ఈ ధనుర్మాసమంతా నెల ముగ్గులని వేస్తారు. ఇవి చుక్కలు లేకుండా గీతాలతో వేస్తారు.

ఈ ముగ్గులు ఎక్కువగా గోదావరి జిల్లాల వారు వేస్తారు. ఇది ఆ ప్రాంతం వారి ప్రత్యేకత. ఇప్పటికీ అక్కడ కొంతమంది   రొజూ వేసే ముగ్గులు ఇలాంటివే  వేస్తారు. అయితే, ధనుర్మాసంలో వేసే నెల ముగ్గులు, పండుగకి  వేసే, దారుల ముగ్గులు, రథం ముగ్గులు ఇలా ప్రత్యేకంగా ఉన్నాయి. 

నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వేసే వారని గుర్తు. కొన్ని మాత్రమే, అమ్మ పుస్తకంలో పొందు పరిచారు. చాల మటుకు నాకు గుర్తులేవు. గుమ్మడికాయ, తాబేలు ఇలా కొన్ని గుర్తు ఉన్నవరకు నేను పొందుపరిచాను. అవి ఈ టపాలలో మీతో పంచుకుంటాను.

నా విన్నపం ఏమిటంటే, దయ చేసి మీకు ఇలాంటి ముగ్గులు తెలిస్తే, నాకు గీసి పంపగలరు. ఇవి అంతరించి పోకుండా కాపాడటం మన కర్తవ్యం.

క్రింది రెండు ముగ్గులను గాదె అని అంటారు.

 పైన ఉన్న ముగ్గుని బ్రహ్మ ముడి అని కూడా అంటారు.  అయితే ఇంకా గుండ్రంగా వేయలనుకుంటా.

మరికొన్ని రాబోయే టపాలలో...

మీ...అనామిక....

3 comments:

రసజ్ఞ said...

నాకు కొంచెం తీరిక చిక్కగానే వేసి పంపిస్తానండీ!

నీహారిక said...

Nice and keep posting !!

అనామిక... said...

Thanks Nihaarika