Tuesday, 15 November 2011

నా సృజన-ఆభరణాలు

లక్ష్మి లాకెట్  హారం

ఇది సాండ్ స్టోన్ మరియు లక్ష్మి లాకెట్ తో చేసింది. 


మీ...అనామిక....

Sunday, 13 November 2011

చిత్ర విచిత్రమైన తేనీటి పాత్రలు

టీ, చాయ్ అదే నండీ  తేనీరు.  ఆ మాట వినగానే టీ త్రాగే అలవాటు ఉన్నవారికి ప్రాణం లేచొస్తుంది. చలి కాలంలో వేడి వేడి టీ తాగుతుంటే ఇంకా వేరే చెప్పాలా? పూర్వం చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు ఈ తే నిటి పాత్రలను కూడా ఎంతో అందంగా తయారుచేసేవారు. వాటి విలువ ఇప్పుడు చాల ఉంటుంది. అందుకే పింగాణి పాత్రలను ఇప్పటికి ఆంగ్లేయులు చైనా అనే అంటారు. అయితే ఈ రోజుల్లో దేశ విదేశాలలో చిత్ర విచిత్రమైన తేనీటి పాత్రలు తయారు చేస్తున్నారు. మచ్చుకి కొన్ని:


చూసారుగా ఎంత బాగున్నాయో? 


మీ...అనామిక....

Wednesday, 9 November 2011

సబ్బులలో కళాఖండాలు

సబ్బు అంటే ఆ ఏముంది లేండి-లక్స్, మేడిమిక్స్, మైసూరు సండల్, ఇలా ఇంతేగా అనుకుంటాం. వాటి సువాసన గురించి అనుకున్నప్పుడు గులాబీ, మంచి గంధం...ఇలా గుర్తుకొస్తాయి. కాని ఇవి చుస్తే ఏమనిపిస్తుంది?

 కాఫ్ఫీ గింజలు కాదు సబ్బు 

ఇవి చూస్తే నోరుఉరుతోంది  కదూ?
 రంగు రంగుల సబ్బులు 


 ఇవన్ని సబ్బులే 

 సాలీడు కాదు సబ్బు 

సబ్బులలో కళాఖండాలు. నాకైతే ఇంత సృజనా శక్తితో ఈ సబ్బులు తయారు చేసిన వారు అభినందనీయులు అని అనిపిస్తుంది.  మీరు ఏమంటారు? 

మీ...అనామిక....

Tuesday, 8 November 2011

జనప నారతో(Jute) ఆభరణాలు

జనప నార, పూసలతో తయారు చేసిన ఆభరణాలు ఇప్పుడు అతివలు ఇష్టపడుతున్నారు. ఇవి ఈశాన్య రాష్ట్రాలు ఇంకా బెంగాల్ లో తయారు చేస్తారు.  
ఇవి మన దుస్తులకు నప్పే రంగులో దొరుకుతాయి. ఈ లింక్ లో ఇంకా కొన్ని చూడండిమీ...అనామిక....

Monday, 7 November 2011

రంగవల్లి-8

తులసి కోట 


ఇవాళ చిలుకు ద్వాదశి అంటే క్షీరాబ్ధి ద్వాదశి. లక్ష్మీ తులసినీ, కృష్ణ తులసిని, తులసి కోటలో పెట్టి, ఉసిరి కొమ్మని పాతి, లక్ష్మీ నారాయణులు, రాధా కృష్ణుల పటాలు పెట్టి పూజ చేస్తారు. తులసి కోట ముందు 5  పద్మాల ముగ్గులు వేసి, వాటిలో దీపాలు పెట్టి, 5  రకాల పిండి వంటలు, పళ్ళు నివేదన చేసి, తులసమ్మకి వస్త్ర తాంబూలాలు, పసుపు కుంకం సమర్పిస్తారు. 

ఉసిరి కాయలో ఆవునేతితో  దీపాలు వెలిగించి, రోటిలో చలిమిడి వేసి, పాలు  పోసి  చెరుకు గడతో తొక్కుతారు. ఆ పాలు చింది మనమిద పడితే ఒకొక్క చుక్కకు వెయ్యి సం. చప్పున మనకి స్వర్గ సుఖము కలుగుతుందని ఒక నమ్మకం. ఈ పూజ వలన, మాంగల్య వృద్ధి, వంశ వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అలనాడు, రాధమ్మకూడా కృష్ణుడి కోసం ఇలా చేసిందిట.


ఏది ఏమైనా మన భారతీయ సంస్కృతిలో చెట్లని కూడా పూజేంచే గొప్పతనం ఉన్నది. తులసి వలన మనకి ఎంతో మేలు కలుగుతుంది. అందుకని ఆ తల్లిని మన పెరట్లో ఉంచి పూజించటం మంచిదేగా.
తులసి చెట్టు 

నాకు మా అమమ్మగారితో చిన్నప్పుడు ఈ ద్వాదసి నాడు చేసుకున్న పూజలు ఇంకా గుర్తు ఉన్నాయి. 
తులసి కోట లేదా బృదావనం 


ఆ గుర్తుగా ఈ రంగవల్లి:
ఇలా తులసి కోట రంగవల్లులు (మెలిక ముగ్గులు) ఎన్నో ఉన్నాయి. కొన్ని వేయటం చాల కష్టం. పైన ఇచ్చినది సుళువుగ వేసేయచ్చు. మరి మీరు వేసి చూడండి. మీ...అనామిక....

Sunday, 6 November 2011

మగ్గు కళాఖండాలు

మగ్గు కళాఖండాలు -మగ్గులనే కళాఖండాలుగా మలిచారు చూడండి. 
 వాయిద్య  పరికరాలు .

 ఆటలు 
 చింపాంజీ 
 గుర్రం 
 ఒంటె 
 కప్పు 
 డ్రాగన్ 
 సీతాకోకచిలుక 
 బాతు
 కప్పు 

 నెమలి-ఇది చాల నచ్చింది నాకు 
ఇది మరీ పిచ్చికి పరాకాష్ట? మీ...అనామిక....

పల్లవి - అనుపల్లవి


మీర జాలగలడా ...

ఈ పాట నాకు చాల చాల ఇష్టం. ఇందులో తెలుగుతనం ఉట్టి పడుతుంది. అంతే కాదు రంగస్థలం లో మన తెలుగు వారికున్న ప్రత్యేకత-"పద్యము" ని గుర్తుకు తెస్తుంది. సుశీలగారు ఆ బాణిలో ఈ పాటను పాడి ఈ పాటను ఒక ఆణిముత్యం లా మనకి కానుక ఇచ్చారు.చిత్రం: శ్రీ కృష్ణ తులాభారము 
తార గణం: N T R, జమున, అంజలి దేవి, కాంతా రావు 
రచన: చందాల కేశవదాసు సిద్ధాంతి 
గాయకులూ : సుశీల
స్వరకల్పన: పెండ్యాల 

మీర జాలగలడా...
మీర జాలగలడా నా యానతి 
వ్రత విధాన మహిమన్ సత్యాపతి(3)

నటన సూత్ర ధారీ మురారి 
యెటుల దాట గలడో నా యానతి 
వ్రత విధాన మహిమన్ సత్యాపతి (2)

మీర జాలగలడా నా యానతి
వ్రత విధాన మహిమన్ సత్యాపతి

సుధా ప్రణయ జలధిన్ వైదార్పితి ఈడ తావు గలదే 
నాతోనిక వాదులాడ గలడా సత్యాపతి (2)

మీర జాలగలడా నా యానతి 
వ్రత విధాన మహిమన్ సత్యాపతి

మధుర మధుర మురళీగానరసా స్వాదనమున 
ఆ ఆ ఆ .......
మధుర మధుర మురళీగానరసా స్వాదనమున 
ఆధార సుధారసమును మదినేగ్రోలగా(2) 

మీర జాలగలడా నా యానతి 
వ్రత విధాన మహిమన్ సత్యాపతి(2)


మీ...అనామిక....

అమ్మమ్మ చిట్కాలు-1

వెండి మెరుపులు 


ఈ శీర్షికలో నాకు  తెలిసిన, నేర్చుకున్న కొన్ని చిట్కాలు మీ కోసం.....


సధారణంగా వెండి వస్తువులు నల్ల పడుతూ ఉంటాయి. వాటిని మాములుగా తోమితే అంతగా మెరవవు. మెరుపు రావాలంటే ఈసారి  ఇలా చేసి చూడండి:
ఒక పెద్ద పాత్ర లో బాగా నీళ్లు పోయండి. అవి పొయ్యి మీద పెట్టి బాగా మరిగే దాకా వేడి చేయ్యండి.ఇప్పుడు సెగ బాగా తగ్గించి లేదా ఆర్పి వేయండి. ఆ నీళ్లలో లో 2-3 టేబుల్ చెంచాల వంట సోడా వెయ్యండి. అది ఒక్కసారిగా పొంగినట్టు అవుతుంది. జాగ్రత్త సుమా. ఇప్పుడు వెంటనే అందులో మీ వెండి వస్తువులు వేయండి. అవి పూర్తిగా ములగాలి. 3-5 ని. తరువాత వాటిని తీసి, తడి పోయే దాకా తుడిచి, ఎర్ర కాగితంలో చుట్టి జాగ్రత్త చెయ్యండి లేదా వాడుకోండి. వెండి వస్తువులు ఎంత తళ తళమని మెరుస్తాయో మీరు చూసి చెప్పండి. 


మీ...అనామిక....