Sunday 23 October 2011

పల్లవి-అనుపల్లవి


ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. ఎంత బాగా రాసారు ఆత్రేయగారు. మంచి స్వరకల్పన. అంతే గొప్పగా పాడారు బాలు.

చిత్రం: ఇంద్రధనస్సు
తార గణం: కృష్ణ, శారద
రచన: ఆచార్య ఆత్రేయ
గాయకులూ : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం
స్వరకల్పన: కె. వి. మహాదేవన్ 

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది (2 )
నేనొక ప్రేమ పిపాసిని....

తలుపు మూసిన తల వాకిట నే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులే రాక అలసి తిరిగి వెళ్ళుతున్నా(2)
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని....

పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగి పోయాను

నేనొక ప్రేమ పిపాసిని....

పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుత్తున్నా నీ చెవిన పడితే చాలు
నీ ఙ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని....

ఇదొక ఆణిముత్యం. మీ కోసం....


మీ...అనామిక....

No comments: