Sunday 25 December 2011

ఎంబ్రాయిడరి కుట్లు-పరిచయం

పరిచయం 

కుట్లు అల్లికలు అంటే నాకు చాల ఇష్టం. ఒక్క మన భారత దేశం లోనే ఎన్నో రాకాలైన చేతి కుట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతానిది ఒకొక్క ప్రత్యేకత. బహుశా వాటన్నిటి గురించి కొంతైన తెలుసు కోవటానికి మన జీవితం చాలదని అనిపిస్తుంది.  

ఇక ప్రపంచం మొతం చూస్తే ఎన్నెన్ని కుట్లు, అల్లికలు మనం చెప్పలేము. ఇలా దేశ విదేశాల కుట్లు అల్లికలలో వైవిద్యం ఉన్నా,  చాలా పోలికలు, సమత్వము ఉన్నాయి. ఒకొక్క సారి కొంచం జాగ్రత్తగా తరచి చుస్తే మనకే ఆశ్చర్యమేస్తుంది.


నేను భారత దేశం లోని వివిధ కుట్లు అల్లికలే కాక విదేశాల లోనివి కూడా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను.  నాతొ పాటు మీరు కూడా నేర్చుకోండి. 


ఈ శీర్షికలో నేను చెప్పేవి ఎంబ్రాయిడరి కుట్లు 


కుట్లు ప్రధానంగా రెండు విధాలు 


1  మెషిన్ తో కుట్టేవి -Machine Embroidery
2  చేతితో కుట్టేవి -Hand Embroidery


మెషిన్ తో దుస్తులు కుట్టటమే కాక అందంగా ఎంబ్రాయిడరి, చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అనేకమైన మెషిన్లు  అందుబాటులో ఉన్నాయి. రకరకాలైన కుట్లు, పీకో ఇలా ఎన్నో చేసుకోవచ్చు. మన బడ్జెట్ని బట్టి కొనుక్కోవచ్చు. 




కాని చేతితో చేసే ఎంబ్రాయిడరి మాటే వేరు. అందులో ఎన్నో రకాలు ఉన్నాయి. మనం కొత్తవి కూడా సృష్టించుకోవచ్చు. మన చీరె మీదో, రవికె మీదో, పిల్లల బట్టల మీదో, కుషన్ కవర్స్ మీదో, ఇలా దేనిమిదైన మనం సొంతంగా  చేతితో ఎంబ్రాయిడరి చేస్తే ఆ అందం ఆ ఆనందం  వేరు. దీని కోసం మనం పెద్దగా కష్టమైన కుట్లు నేర్చుకోనవసరం లేదు. సులభంగా ఉన్న ప్రాధమిక కుట్లతోనే ఎంతో అందమైన ఎంబ్రాయిడరి చేయవచ్చు.


చేతి ఎంబ్రాయిడరిలో రకాలు:
1. Surface Embroidery
2. Other than Surface Embroidery 


1. Free Style or Surface Embroidery: ఇందులో ప్రధానంగా డిజైన్ని బట్ట మిద గీసుకుని ఆ డిజైన్ ప్రకారం ఎంబ్రాయిడరి చేస్తారు. ఈ ఎంబ్రాయిడరి ఉద్దేశం కుట్టిన డిజైన్ బట్ట ఉపరితలం (అంటే బట్ట పై) కనిపించాలి. ఇది ఏ బట్ట పైన ఆయినా చేయవచ్చు. 


వీటిలో  చాల రకాలు ఉన్నాయి.  Crewel or Jacobean Work, Black Work, Red Work, Blue work, Appliqué ఇలా చాల రకాలు ఉన్నాయి. వీటి గురించి ఒక్కొకటిగా తరువాత చెప్పుకుందాం. 


ఈ రకం ఎంబ్రాయిడరిలో గీసుకున్న ఆకారాన్ని బట్టి కుట్టు వేస్తారు. ప్రాచిన కాలం నుండి ఉన్న కుట్లు అన్ని ఈ కోవకి చెందినవే. అంటే మనం మాములుగా   కుట్టేవి  అన్ని ఇవే కుట్ట్లన్న మాట. ఇప్పుడు ఇంకా చాలా కొత్తవి చేరాయి.


2 . Other than Surface Embroidery: అంటే బట్ట లోపలనుండి కుట్టేవి, కత్తిరించి, పోగులు లాగి కుట్టేవి అన్న మాట. ఇందులో Counted Thread Embroidery (Cross Stitch, Needle Point), Cut Work, Drawn Thread Work ఇలాంటివి  ఉంటాయి.


ముందుగా మనం Free Style Embroidery Stitches నేర్చుకుందాం. ఇందులో దేశ విదేశాల కుట్లు ఉన్నాయి. మరి మీరు రెడీ నా? 



మీ...అనామిక....

No comments: