Sunday 30 October 2011

కాగితపు గుజ్జు తో కళాఖండాలు


అరవై నాలుగు కళలు అంటారు మన పెద్దలు. కాని నాకు మాత్రం మనిషికి ఎన్ని ఆలోచనలో అన్నిఅని  అని పిస్తాయి. కాగితపు గుజ్జుని పోత పోసి కళాఖండాలు చేయటం అంటే చాల తేలిక అని అనిపిస్తోందా? ఈ లింకుల   లో చూడండి ఎంత సృజన, శ్రమ దాగి ఉన్నాయో 



ఆ కళాకారులను మెచ్చుకోకుండా ఉండలేము. 

మీరు చూసి ఆనందించండి ...

మీ...అనామిక....

Saturday 29 October 2011

కేక్స్

కేక్స్  అంటే ఎవరికైనా నోరూరుతుంది. కానీ ఈ కేక్స్ చూడండి. ఇవి ఎంత కళాత్మకంగా ఉన్నాయో కదా. వీటిని అలా చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. 










ఇవి కేక్స్ అంటే నమ్ముతారా? వీటిలో కేవలం తినే  పదార్దాలే తప్ప ఇతరత్రా ఏమి వాడలేదుట.....


మీ...అనామిక....

పల్లవి-అనుపల్లవి

చిత్రం: బంధిపోటు 
తార గణం: N T R, కృష్ణ కుమారి
రచన: Dr C నారాయణ రెడ్డి
గాయకులూ : ఘంటశాల, సుశీల
స్వరకల్పన: ఘంటశాల


ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే (2)
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
తొలి ప్రేమ లొ బలముందిలే
అది నికు మునుపే తెలుసు II ఊహాలు...II

నను కోరి చేరిన బేలా
దూరన నిలిచేవెలా
నీ ఆనతి లేక్కున్నచో
విడలేను ఊపిరి కూడా II ఊహాలు...II

దివి మల్లె పందిరి వేసే
భువి పెళ్లి పీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు
నెల రాజు పెండ్ళిని చేసే

ఊహలు గుస గుస లాడే
మన హృదయములూయలూగే 


మీ...అనామిక....

టెర్రకోట

టెర్రకోట - గృహ అలంకరణ 
ఇది విండ్ చైమ్. కిటికీ దెగ్గర కాని మన తోటలో కానీ వేళ్ళాడదీయవచ్చు.


ఇవి కూడా తోటలోకాని లేదా ఇంట్లో కాని పెట్టుకోవచ్చు. 

కావాలంటే రంగులు వేసి అలంకరించుకోవచ్చు. నాకు మాత్రం ఈ రంగే ఇష్టం. సహజంగా అనిపిస్తుంది. 

మీ...అనామిక....

నా సృజన-ఆభరణాలు

నాకు ఎప్పుడు ఏదో ఒక కొత్త కళని  నేర్చుకుని కొత్త కొత్తవి తయారు చేయాలని ఆశ. ప్రస్తుతం నేను, ఆభరణాల తయారీలో కొంత కసరత్తు చేస్తున్నా. ఇవన్ని గిల్టువే సుమా. బీడ్స్ మరియు ఎన్నో రకాలైన ఇతర వస్తువులతో ఈ నగలు తయారు చేయటం నాకు చాల సరదా. 

ఇది నేను చేసిందే. నా చెల్లికి నల్ల పుసలంటే ఇష్టం. అందుకని మొన్న శ్రావణ శుక్రవారం తనకి కానుకగా పసుపు కుంకం తో ఇవ్వటానికి  తయారు చేశాను. దండ మధ్యలో లక్ష్మి అచ్చు ఉన్న కాసు ఉంది. నాకు అన్నిటిలోకి నచ్చింది వెనక ఉన్న డోరి. నేను అది చూసిన వెంటనే నల్లపూసల గొలుసు తాయారు చేస్తే బాగుంటుందని అనిపించింది, ఈ డిజైన్ కూడా స్పురించింది. వెంటనే ఇది  చేశాను. ఎలా ఉంది?

మీ...అనామిక....

కూరలు-పళ్ళతో బొమ్మలు

నేర్చుకోండి నాతొ ...

కూరగాయలు, పళ్ళతో చేసే బొమ్మలను వెజిటేబుల్ - ఫ్రూట్  కార్వింగ్ అంటారు. తినే పదార్థాన్ని రుచిగా వండటమే కాదు దానిని చూడ చక్కని రీతిలో నోరూరించే లాగా అలంకరిస్తే ఇంకా బాగుంటుంది. ఇవి తినము అవి తినము అని మారం చేసే పిల్లలను గొడవ చేయకుండా తినిపించాలన్న ఇది ఒక చక్కని మార్గం.

ఈ కళ థాయిలాండ్ లో పుట్టిందని, కాదు చైనాలో అని కాదు జపాన్ అని ఇలా చాల వాదనలు ఉన్నాయి. ఎక్కడ పుట్టిందని చెప్పటం కష్టం. కానీ ఈ దేశాలలోనే కాక ఇప్పుడు అనేక దేశాలకు కూడా ఈ కళ విస్తరించింది. 

పెళ్ళిళ్ళలో, పార్టీలలో ఇప్పుడు ఇలాంటి చాలా కళాఖండాలు మనకి కనిపిస్తాయి.

ఇవి చూడండి ఈ కళని సాధన చేసేవారు ఎంత అద్భుతమైన కళ ఖండాలను సృష్టిస్తున్నారో..
వంకాయలతో పెంగ్విన్ 
పళ్ళు కూరగాయల తో 
కాప్సికం తో కప్పలు 
 పళ్ళతో 
 కూరలతో 
 కాలిఫ్లవర్ తో 
 టొమాటో కమలాల తో 

నాకు ఈ కళ లో కొంత ప్రవేశం ఉంది. నాతో నేర్చుకోండి ఈ కళని.  వచ్చే   టపాలనుండి .....


మీ...అనామిక....

Thursday 27 October 2011

డిజైనర్ బ్లౌజ్

ఈ మధ్యన డిజైనర్ బ్లౌజులు చాలా ఇష్టపడుతున్నారు. ఒక్కొక్క సారి చీరె కంటే కూడా బ్లౌజ్ ధరే ఎక్కువగా ఉంటోంది. ఒక చీరె మీదకి ఒక బ్లౌజ్ కొనుక్కున్నా దానిని వేరే చీరెల మీదకి కుడా వాడవచ్చు. అదీకాక ఈ మధ్యన వచ్చేవి పాచ్  వర్క్ , చమ్కీ వర్క్, బెనరాసి ఇలా రకరక్కలుగా ఉంటున్నాయి. 


ఇవి చూడండి 50 రకాల  డిజైనర్ బ్లౌజులు:


చాల బాగున్నాయి కదూ 


మీ...అనామిక....

Wednesday 26 October 2011

డిజైనర్ దీపాలు

దీపావళి వచ్చిందంటే సందడే సందడి,  ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుని అందంగా తీర్చి దిద్దుకుంటాం. అన్నిటి  కంటే ముఖ్యం రాత్రి వేళ దీపలతొ ఇంటిని, ఇంటి బయట అలకరించటం. 

ఎంత గొప్పవారైన వెండి, బంగారం ఇత్తడి కుందులు పెట్టినా తప్పని సరిగా మట్టి తో చేసిన ప్రమిదెలు పెట్టవలసిందే. ఇప్పుడు అందారు మోజు పది కొనుక్కునేవి అలకరించిన డిజైనర్ ప్రమిదెలు. రంగులతో, చెమ్కీలతొ అలంకరించి అంతో ఆకర్షనీయంగా తయారు చేస్తున్నారు. కాని కొనాలంటే బోలెడు ఖరీదు. అదే ఇంట్లో మనమే చేసుకుంటే, ఆదా కి ఆదా మనమే సొంతంగా చేసుకున్నామని ఒక తృప్తి  కూడా.

మరి ఇంకెందుకు ఆలస్యం. నాతో కలసి మిఇరు చేయండి.

కావలసినవి:

మట్టి ప్రమిదెలు
రంగులు 
కుంచెలు

మట్టి ప్రమిదెలు (టెర్రకోట)అనేక రకాలైన ఆకారాలు, సైజులు మరియు డిజైన్లలో దొరుకుతున్నాయి. ధర కూడా మన బడ్జెటు ని బట్టి పెట్టవచ్చు.

రంగులు-ఎనామిల్ కాని, లేదా వాస్త్రాల పై వాడే ఫ్యాబ్రిక్ (Acrylic) రంగులు  కానీ  వాడవచ్చు. నాకు, ఎనామిల్ కంటే Acrylic అంటేనే ఇష్టం. ఏనామేల్ లో రంగులు(షేడ్స్) చాల తక్కువ. Acrylic రంగులు  చాల  హాయి.  మాములు సాదా రంగులలో అనేక షేడ్స్ కాక, మెటాలిక్, పెరల్ లో కూడా చాల షేడ్స్ ఉన్నాయి. కేవలం నీళ్లు కలిపి వాడు కోవచ్చు.

ముందుగా ప్రమిదెలను ఒక టబ్ లో పేర్చి బాగా ఫై దాక నీళ్లు పోసి, ఒక రాత్రి నాన నివ్వాలి. తరువాత మరుసటి రోజు  తీసి ఒక గంట బోర్లించి, ఒక గంట మామూలుగాను ఆరనివ్వాలి.

తరువాత మీకు నచ్చిన విధంగా రంగులతో అలంకరించండి. రంగు తడిగా ఉండగానే, గ్లిటర్ పొడి; ఇవి, బంగారం, వెండి, ఇత్తడి, వంటి మెటాలిక్ రంగులే  కాక  మామూలు రంగులలో కూడా దొరకుతాయి. ఇవి   చల్లుకోవచ్చు. 3D కోన్స్ తో చుక్కలు, గీతలు, లతలతో అలంకరించ్చ వచ్చు.  చాల సులభం. కొద్దిగా అలవాటు పడితే త్వరగా తయారు చేసుకోవచ్చు.

ఇదిగో చుడండి నేను చేస్తున్నవి కొన్ని:









వీటికి  ఇంకా  ఫైనల్  టచెస్ ఇవాలి. అయిన మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. 


మీరు చేసి చూడండి. కార్తిక మాసం అంతా దీపాలు వెలిగించాలిగా ....

మీ...అనామిక....

Monday 24 October 2011

వంటా-వార్పు

ఇదేంటో  చెప్పగలరా ? 
చూస్తేనే నోరూరుతోంది కదూ. తింటే ఇంకా రుచిగా ఉంటుంది. 

చూస్తూ ఉండండి నా బ్లాగ్ ఈ రెసిపి కోసం ఇంకా మరెన్నో వంటలు ....



మీ...అనామిక....

Sunday 23 October 2011

వర్క్ చీరెలు


ఈ మధ్యన చీరెలకి వర్క్ చేసిన patches కుడుతున్నారు. మనం కష్టపడి చీరెల మిద స్వయంగా చేతితో కుట్టే బదులు, ఇలా రెడీగా దొరికేవి కుట్టటం సులభం. త్వరగా చీరె కుట్టేయచ్చు.

ఈ patches రక  రకాలైన  ఆకారాలు, డిజైన్లు, రంగులు, సైజులలో దొరుకుతున్నాయి. వాటి డిజైను, సైజు, వాడిన సామాగ్రి, పనితనాన్ని బట్టి ధర ఉంటుంది. మనం ఒకే రకం patch కాని లేదా వివిధమైనవి మన సృజనని బట్టి వాడుకోవచ్చు. ఈ patches చీరెలు, రవికెలు, చున్నీలు, కుర్తీలు,సల్వార్ సుట్లు ఇలా అన్నిటి మీద కుట్టుకోవచ్చు.

మరి ప్రస్తుతం ఫేషన్ లో ఉన్న కొన్ని Patches చూద్దమా ? 
ఇది చిన్న సైజ్ పూల patch. మధ్యలో స్టోన్/కుందన్ చుట్టూ జరితో వర్క్ చేసారు. ఇవి అనేక రంగులలో, సైజ్లలో దొరకుతాయి. చిన్నవైతే 10, 25, 50, 100 లేదా  వాళ్ళ  పాకెట్లో తీసుకోవాలి. పెద్దవైతే ఒకటి కూడా ఇస్తారు. ఏదైనా ధర ఒక్కింటికి ఇంతని ఉంటుంది.  
వీటికి వెనకవైపు బట్ట అతికించి ఉంటుంది. అందుకని పలుచని చీరె మీద కుట్టినా వెనక వైపు ఎమ్బ్రాయిడరి దారాలు కనిపించవు.  
ఇవి మామిడి పిందెల ఆకారంలో ఉన్నాయి. 
ఇవి వెల్వెట్ మీద చేసిన  వర్క్. 


వీటిని, చిన్నవైతే ఫ్యాబ్రిక్ గ్లూ తో అతికించుకోవచ్చు. పెద్దవైతే తప్పనిసరిగా టాకాలు వేసి కుట్టటమే మంచిది. ముందుగ ఎలా కుడితే బాగుంటుందో చూసుకుని, అటు తరువాత గ్లూ పెట్టి అంటించి ఆరిన దాక వదిలేయాలి. అటు తరువాత మనం చేతితోకాని, మెషిన్ తో కానీ కుట్టుకుంటే అవి ఊడి పొతాయని భయం ఉండదు.


మరికొన్ని వచ్చే టపాలలో.....

మీ...అనామిక....

పల్లవి-అనుపల్లవి


ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. ఎంత బాగా రాసారు ఆత్రేయగారు. మంచి స్వరకల్పన. అంతే గొప్పగా పాడారు బాలు.

చిత్రం: ఇంద్రధనస్సు
తార గణం: కృష్ణ, శారద
రచన: ఆచార్య ఆత్రేయ
గాయకులూ : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం
స్వరకల్పన: కె. వి. మహాదేవన్ 

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది (2 )
నేనొక ప్రేమ పిపాసిని....

తలుపు మూసిన తల వాకిట నే పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులే రాక అలసి తిరిగి వెళ్ళుతున్నా(2)
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని....

పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగి పోయాను

నేనొక ప్రేమ పిపాసిని....

పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుత్తున్నా నీ చెవిన పడితే చాలు
నీ ఙ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని....

ఇదొక ఆణిముత్యం. మీ కోసం....


మీ...అనామిక....

దారాలతో నగలు

రకరకాల దారాలతో  నగలు చూసారా? మాములుగా కొంచం  మందంగా ఉండే దారం/తాడు  ( cord)  వంటి వాటికీ  pendants వేసుకుని ధరిస్తం.  

రాజస్తాన్  కళాకారులు, పట్టు చేమ్కి దారాలతో నేక్లసు, గాజులు, చెవి రింగులు తయారు చేస్తారు. ఇవి మన దుస్తులకు నప్పే విధంగా వివిధ  రంగులలో దొరుకుతాయి. 

ఇవి చుడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఉత్తరాదిన అతివలు ఎక్కువగా ధరిస్తారు. వీటిలో మీనాకారి, గాజు, వెండి, రాళ్ళూ పొదిగిన పూసలు, pendants ఉన్నవి పట్టు చీరెల  పై బాగుంటాయి. 

ఇవి మనము ఇంట్లో చేసుకోవచు. నేను అలా చేసి నా స్నేహితులకి, చుట్టాలకి ఇస్తాను. చిన్న పిల్లల నుంచి, టీన్ ఏజీ పిల్లలకి, ఎవరికైనా బాగానే ఉంటాయి ఈ నగలు. కాక పోతే వయసుని బట్టి, ధరించిన సమయాన్ని, సందర్భాన్ని బట్టి, ఏ దుస్తుల ఫై ధరిస్తామో అన్న దానిని బట్టి వీటిని ఎంచుకోవాలి.

ఈ లింక్లో ఇంకా బోలెడన్ని రకాలు చూడండి:


బాగున్నాయి కదూ.....

మీ...అనామిక....

Saturday 22 October 2011

రంగవల్లి -7

దీపావళి ముగ్గులు-4


ఇది ఇంకొక మెలికె ముగ్గు. కొంచం కష్టమైనది. కాని బాగుంది కాదు.

ఇంకొన్ని వచ్చే టపాలలో...

మీ...అనామిక....

రంగవల్లి -6

దీపావళి ముగ్గులు-3


ఈ ముగ్గు చూడండి. ఇది లక్ష్మి పూజకి వేసుకుంటే బాగుంటుంది. కాలువలు, స్వస్తిక్, దీపాలు ఇవన్ని అమ్మవారికి ఇష్టం కదూ. అందుకని ఇవన్ని ఒకే ముగ్గులో పొందుపరిచా.

19X1 ఎదురు చుక్కలు పెట్టుకుని కలుపుకోవాలి. 

ఇంకొన్ని  వచ్చే  టపాలలో...

మీ...అనామిక....