Friday 23 September 2011

దిల్ బహార్




ఈ పువ్వుని దిల్ బహార్  అంటారు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారి పెరట్లో ఈ చెట్లు బోలెడన్ని ఉండేవి. వీటి పువ్వులు  రోజా పువ్వులను  పోలి ఉంటాయి. తెలుపు ఎరుపు రంగుల మిశ్రమంతో ఉండి సువాసన కలిగి ఉంటాయి. గుత్తులు గుత్తులుగా పూస్తాయి. 

ఇవి చూడటానికి  చాల అందంగా ఉంటాయి కాని ఈ పువ్వులలోని తేనే కోసం రకరకాలైన చీమలు, ముఖ్యంగా కండ చీమలు వీటిని అంటి పెట్టుకుని ఉంటాయి. ఈ సువాసన కూడా ఎక్కువ సేపు పిలిస్తే తల భారంగాను నెప్పిగాను ఉంటుంది. అందుకని తలలో తురమ లేము. 

మొన్న ఈ మధ్యన ఈ పువ్వులను  ఒకరి ఇంట్లో చూసి నా కెమెరాలో బంధించాను. 



మీ...అనామిక....

No comments: