Wednesday, 28 September 2011

దసరా సంబరాలు

దసరా సంబరాలు 
goddess durga wallpaper ma kali chandi
దుర్గా మాత
దసరా నవరాత్రులు ఇవాల్టి నుండి ప్రారంభం. మననందరినీ  కాపాడే చల్లని తల్లిని అనేక రూపాలుగా కొలుస్తాము. మరి ఈ నవరాత్రులు మనం అమ్మ విశేషాలను గురించి చెప్పుకుందామా ....


చూస్తూ ఉండండి నా బ్లోగని......మరిన్ని విశేషాల కోసం....


మీ అందరికి  నా దసరా శుభాకాంక్షలు... మీ...అనామిక....

Friday, 23 September 2011

దిల్ బహార్
ఈ పువ్వుని దిల్ బహార్  అంటారు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారి పెరట్లో ఈ చెట్లు బోలెడన్ని ఉండేవి. వీటి పువ్వులు  రోజా పువ్వులను  పోలి ఉంటాయి. తెలుపు ఎరుపు రంగుల మిశ్రమంతో ఉండి సువాసన కలిగి ఉంటాయి. గుత్తులు గుత్తులుగా పూస్తాయి. 

ఇవి చూడటానికి  చాల అందంగా ఉంటాయి కాని ఈ పువ్వులలోని తేనే కోసం రకరకాలైన చీమలు, ముఖ్యంగా కండ చీమలు వీటిని అంటి పెట్టుకుని ఉంటాయి. ఈ సువాసన కూడా ఎక్కువ సేపు పిలిస్తే తల భారంగాను నెప్పిగాను ఉంటుంది. అందుకని తలలో తురమ లేము. 

మొన్న ఈ మధ్యన ఈ పువ్వులను  ఒకరి ఇంట్లో చూసి నా కెమెరాలో బంధించాను. మీ...అనామిక....

Sunday, 18 September 2011

తాటాకు పళ్ళాలు-Palm Leaf Plates

మన భారత దేశం ప్రకృతిని పూజించే దేశం. అనాదిగా ప్రకృతిని తల్లిగా దేవతగా భావించి పూజించటం మన సాంప్రదాయం. ఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతిని  గుడ్డిగా అనుసరించి అనుకరించడం మనకి  అలవాటై పోయింది. 

పూర్వం భోజనమైన, ఇడ్లి ఉప్మా లాంటివైన చక్కగా, అరిటాకో, విస్తరాకులోనో  తినే వాళ్ళం. ఇది ఆరోగ్యానికి చాల మంచిది. ఒకళ్ళు తినే  కంచంలోనో పళ్ళెంలోనో  తినటం  అనేది ఎంగిలి కిందే లెక్క . ఎవరు తినే కంచం, తాగే గ్లాస్ ఇప్పటికీ  వేరే ఒకరు వాడరు. అథితులోస్తే వాళ్లకి మన వాడేవి వాడాలంటే ఇబ్బంది. 

నా చిన్న తనంలో మా అమ్మమ్మగారింట్లో బాదం చెట్టు ఉండేది. ఎవరైనా భోజనానికి వస్తే వెంటనే ఆ ఆకులతో విస్తరి కుట్టి చక్కగా భోజనం వడ్డించేవారు. 

ఇలా ఆకులో తినటం వలన ఎంగిలి దోషం ఉండదు. చాల రుచిగా ఉంటుంది. పత్ర హరితముతో వేడిగా ఉన్న పదార్ధం  చర్య పొంది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

మీరు ఎప్పుడైనా వేడి వేడి ఇడ్లి కానీ, ఉప్మా లేదా దోశ, పెసరట్టు ఆకులో తిని ఉంటె, దాని రుచే వేరు. వేడి వేడి చారన్నం కూడా చాల రుచిగా ఉంటుంది. 

ఆకు లో తినటం వలన ఉపయోగాలు:
  • రుచి
  • శుభ్రత
  • ఆరోగ్యం
  • తిన్న తరువాత పత్రాలు శుబ్రం చేసే పని లేదు
  • పార వేసిన త్వరగా మట్టిలో కలిసిపోతుంది- ఇకో ఫ్రెండ్లీ: పరియావరణానికి  కూడా  ముప్పు లేదు
  • పెరట్లో  చెట్టు ఉన్నా, లేదా విస్తరాకులు కొని పెట్టుకున్నా, ఎంత మంది అథితులు  వచ్చిన ఇబ్బంది ఉండదు
  • ప్రయాణం చేసేటప్పుడు తీసుకుని వెళ్తే బరువు ఉండవు, పారవేయటం  తేలికే


ఇప్పుడు ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. పేపరుతో చేసిన పళ్ళాలు, దొన్నెలు, కంచాలు వస్తున్నాయి. విస్తరాకుతో  చేసినవి కుడా ఉంటాయి. అవి గట్టిగ ఉండటానికి, కింద పేపరు వేసి చేస్తున్నారు. ఇలా అన్నో రకాలు. 

ఇవి చూడండి. ఈ మధ్యన నేను ఒక ప్రదర్శనలో చూసాను. 
ఇవి తాటాకుతో చేసినవి. చాల ధృడంగా ఉన్నాయి. వివిధ ఆకృతులలో, పరిమాణాలలో దొరుకుతున్నాయి. ధర కూడా మరి అంత ఎక్కువేమి కాదు. చూడడానికి కూడా చాల బాగున్నాయి. 
ఇవి రాలిపోయిన తాటాకులతో చేస్తారట. వాడి పడేసిన తరువాత త్వరగా మట్టిలో కలిసిపోతుంది. అందుకని, పరియావరణానికి  కూడా  ముప్పు లేదు.  ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో తయారు చేస్తున్నారు. మన ఆంద్ర దేశంలో ఎవరూ తయారు చేస్తోనట్లు లేదు. ఇక్కడ ఎక్కడ దొరకుతాయో కొంచం వెదకి చూడాలి. మన రాష్ట్రంలో కూడా తాటి చెట్లు ఉంటాయి. ఇప్పుడు కనుమరుగై పోతున్నాయి. ఇలాంటి పరిశ్రమ మన వాళ్ళు కూడా పెడితే, వారికీ ఆదాయమే, మనకీ ఆరోగ్యమే. 

ఈ క్రింది లింక్ లో  మరిన్ని ఉత్పత్తులను చూడొచ్చు ...


ఇది వారి చిరునామా:

Eco Palm Leaf Industries
Nandhavana Thottam, Vaiyapuripudur, Puttuvikki,
Sundakkamuthur Road, Coimbatore 641010
Tamilnadu, India
Tel: +91 422 4208665 Fax: +91 422 4355866
Email: view@ecopalmleafplates.com

మీరు కొని వాడి చూడండి.......

మీ...అనామిక....

Thursday, 15 September 2011

రంగవల్లి -3

పూల తివాచి 


20  చుక్కలు  4  వరుసలు, 16, 14, 12, 10, 8, 6, 4 చుక్కలు. పైన చూపిన విధంగా కలుపుకోవాలి. ఇది చాల సుళువు. రంగు నిన్పుకోవతంకి కూడా ఎక్కువ సమయం పట్టదు. 

ఇంకా అందంగా కావాలనుకుంటే background ఏదైనా కాంట్రాస్ట్ రంగుతో నింపితే బాగుంటుంది.                                        


మీ...అనామిక....Wednesday, 14 September 2011

చెప్పుకోండి చూద్దాం


మా పెరట్లో ఈ పూల తీగ ఉంది. దీనికి గుత్తులు గుత్తులుగా తెల్లని పూలు పూస్తాయి. ఇవి మంచి వాసనా కలిగి ఉంటాయి. నేను కొన్నప్పుడు ఆ నర్సరీ వాళ్ళు దీని పేరు  "నాగమల్లి " అని చెప్పారు. కానీ నాగమల్లి అంటే "శివలింగ" పుష్పమని నా స్నేహితురాలు అంటోంది. మీకు తెలిస్తే ఇది ఏ తీగో, ఈ పూలను ఏమంటారో దయచేసి చెప్పగలరు.
నేను అంతర్జాలంలో వెతికాను కానీ ఫలితం లేక పోయింది. మీకేమైనా తెలుసోనని  అడుగుత్తున్నా


మీ...అనామిక....

Monday, 12 September 2011

రంగవల్లి -2

పూల తీగె 


మధ్యలో 12 చుక్కలు 4 వరుసలు. తరువాత  రెండు వైపులా 10,8,6,4 ఎదురు చుక్కలు పెట్టాలి. పైన చూపిన విధంగా చుక్కలను కలుపుకోవాలి. 


మీ...అనామిక....

Sunday, 11 September 2011

పల్లవి -అనుపల్లవి

నీ పైన నాకెంతో అనురాగా ముందని ..నాకెంతో ఇష్టమైన పాట. అందులోని భావం ఎంత మధురంగా వ్రాసారు దాశరథి. చక్రవర్తిగారు సమకుర్చిన స్వర కల్పన అద్భుతం. అంతే తియ్యగా పాడారు బాలు. వెరసి ఒక ఆణిముత్యం.

చిత్రం: అభిమానవతి
తార గణం: కృష్ణ, వాణిశ్రీ
రచన: దాశరథి.
గాయకులూ : యస్. పి. బాలసుబ్రహ్మణ్యం
స్వరకల్పన: చక్రవర్తి

నీ పైన నాకెంతో అనురాగా ముందని (2)
నిను వీడి క్షణమైనా నేనుండ లేనని
ఎలా, ఎలా నీకెలా తెలిపేది ( 2) !! నీ పైన!!

నీలి నింగిలో కోటి తారలు మాలల్లల్లి తేనా
అందమైన ఆ చందమామ నీ కురుల తురుమ వలెనా (2)
అణువణువున నీవే వ్యపించినావని (2)
ఎలా, ఎలా నీకెలా తెలిపేది (2) !! నీ పైన!!

వలపు తెలియని మనసులోనికి ఎందుకోసమని వచ్చావు
మనసు దోచుకుని మమత పంచుకొని మరలి వెళ్లి పోతున్నావు
నిన్నే హృదాయన నిలిపాను నేనని
ఎలా, ఎలా నీకెలా తెలిపేది (2 ) !! నీ పైన!!

మీరు విని ఆనందించండి...


మీ...అనామిక....


కలయో నిజమో..Stories Stranger Than Fiction


కలయో నిజమో వైష్ణవ మాయో అని తెలిసీ తెలియని అయోమయంలో ...అని ఒక కవి అన్నారు. కొన్ని కొన్ని నిజంగా జరిగిన సంఘటనలు చాల అబ్బుర పరిస్తే కొన్ని భయాన్ని మరి కొన్ని విస్మయాన్ని కలగజేస్తాయి. వాటిని నమ్మలా వద్దా అని తెల్చుకోలేకపోతాము.  నాకు ఇలాంటి సంఘటనల్లంటే చాలా ఆసక్తి. మీకు కూడా అంతే అయితే దీపక్ దొడ్డమని తన బ్లాగ్ లో వ్రాసిన "కషేది ఘాట్  ఘోస్ట్" చదవండి. మికే తెలుస్తుంది


Some times we come across some incidents, which cause fear, or amazement or wonder. We cannot decide whether to believe them or not. I love to read about such incidents. Do you too? Then read about such a thing in "Kashedi Ghat Ghost" in Deepak Doddamani's post in the link given above. 

I enjoyed reading it.....మీ...అనామిక....

నాకు నచ్చిన ఆ పాత మధురాలు

నాకు నచ్చిన ఆ పాత మధురాలు  ఎన్నో ఎన్నెనో. వెస్ట్రన్, హిందీ తెలుగు, తమిళం ఇలా భాష ఎదైన ఆ భావం, ఆ స్వర మాధుర్యం, పాట చిత్రీకరణ-నా మనసు ఫై చెరగని ముద్ర వేసాయి...అందులోంచి కొన్ని మీతో పంచుకుంటాను.


కే సర సర ...అనే పాట నాకు చాల ఇష్టం. మొదటిసారిగా మా నాన్నగారు నాకు ఈ పాట ని పరిచయం చేసారు. ఆయిన ఇంగ్లీష్, హిందీ  సినిమాలు చాల చూసేవారు. ఆయనకీ ఇంగ్లీష్, హిందీ సాహిత్యంతోనూ  బాగా పరిచయం ఉంది.  నాకు చిన్నపట్టినుంచే మంచి సాహిత్యం, పాటలు, పద్యాలు, సినిమాలు పరిచయం చేసే వారు. ఇలా నాకు కలిగిన రుచి ఇప్పటికి కొనసాగుతోంది. ఈ విధంగా నేను చాల అదృష్టవంతురాలిని. 

ఈ పాటలోని సాహిత్యం చాలా simple కాని చాలా అర్ధవంతమైనది. ఇందలోని భావం: ఏది ఎలా జరగాలని ఉంటె అలా జరుగుతుంది. భవిష్యత్తు గురించి మనం ఆలోచించ కూడదు.

ఈ పాట ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అనే ప్రఖ్యాత డైరెక్టర్- సస్పెన్సు త్రిల్లెర్ సినిమాల డైరెక్టర్, తీసిన  సినిమా "The Man Who Knew Too Much" లోనిది.1934లొ ఆయన  తీసిన సినిమానే మళ్లీ 1956లొ తీసారు. అందులో డోరిస్ డే అనే అభినేత్రి పాడిన పాట ఇది. దీనిని రే ఎవాన్స్ మరియు జే లివింగ్ స్టన్ రచించారు. 


కే సర సర అనే పదాలు ఇటాలియన్ ఫిలిం " ద బేర్ ఫుట్ కన్టేస్సా" లోనివి. కే అనే పదాన్ని స్పానిష్ భాషలోకి మార్చారు-ఎందుకంటే స్పానిష్. మాట్లాడే వారు ఎక్కువగా  ఉన్నారు.


ఈ పాటకు 1956 లో ఆస్కార్ అవార్డు ఇచ్చారు. ఇప్పటికి ఈ పాట చాలా జనాదరణ పొందిన పాటగా పేరుంది.


దీనిని భానుమతి తోడూ-నీడ చిత్రంలో అత్త ఒడి పువ్వు వలె మెత్తన్నమ్మ అనే పాటలో పాడారు.

This song is from Alfred Hitchcock's The Man Who Knew Too Much, remade in 1956 of his own 1934 film. The song was written by Ray Evans and Jay Livingston and sang by Doris Day.


The phrase "Que Sera, Sera" meaning what ever will be, will be-came from the film "The Barefoot Contessa"  as "Che Sera, Sera." (Italian) , but  "Che" was changed by the lyrist to "Que" because there were more Spanish people.


This song won the 1956 Oscar for Best Song.  This song was again used in 1960 film Please Don't Eat the Daisies.LYRICS:


When I was just a little girl
I asked my mother, what will I be
Will I be pretty, will I be rich
Here's what she said to me.

Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be.

When I was young, I fell in love
I asked my sweetheart what lies ahead
Will we have rainbows, day after day
Here's what my sweetheart said.

Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be.

Now I have children of my own
They ask their mother, what will I be
Will I be handsome, will I be rich
I tell them tenderly.

Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be. 


These are the additional lyrics(not in the song sung by Doris Day in the film) as second stanza:

When I was just a child in school
I asked my teacher what should I try
Should I paint pictures
Should I sing songs
This was her wise reply


Que Sera, Sera,
Whatever will be, will be
The future's not ours, to see
Que Sera, Sera
What will be, will be.


తెలుగు అనువాదం :


నేను చిన్నపిల్లగా ఉన్నపుడు మా అమ్మని అడిగాను, నేను పెద్దయిన తరువాత ఎలా ఉంటాను? అందంగా ఉంటానా, ధనవంతురాలిని  అవుతానా? అప్పుడు మా అమ్మ అన్నది- ఏది ఎలా జరగాలని ఉంటే, అలా జరుగుతుంది. భవిష్యత్తు గురించి మనం ఆలోచించ కూడదు అని.

నేను యవ్వనంలోకి అడుగు పెట్టిన తరువాత ప్రేమలో పడ్డాను. నా ప్రియుడిని అడిగాను- మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? మన కోసం రోజు ఒక హరివిల్లు విరుస్తుందా? అప్పుడు తను ఎమ్మన్నాడు అంటే -ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. భవిష్యత్తు గురించి మనం ఆలోచించ కూడదు అని.

ఇప్పుడు నాకు పిల్లలున్నారు, వాళ్ళు నన్ను అడుగుతారు,  నేను పెద్దయిన తరువాత  అందంగా  ఉంటామా,  ధనవంతులం అవుతామా ?  అప్పుడు నేను సున్నితంగా చెప్తాను-ఏది ఎలా జరగాలని ఉంటే, అలా జరుగుతుంది. భవిష్యత్తు గురించి మనం ఆలోచించ కూడదు అని.

మీరుకూడా విని ఆనందిస్తారుగా...

మీ...అనామిక....

Saturday, 10 September 2011

పల్లవి-అనుపల్లవి

ఈ సంధ్యలో కెంజాయలో


ఈ మధ్యన  నేను ప్రయాణం చేస్తుండగా నా కెమేరాకి ఈ  దృశ్యం చిక్కింది. సాయంకాలం సంధ్య సమయం, చల్లని పిల్ల గాలి, ఆకాసంలో సూర్యాస్తమయం వేళ ఆ కెంజాయ రంగు కాంతులు చూస్తోంటే ఈ పాట గుర్తుకొచ్చింది. ఈ పాట చాల ఇష్టం నాకు. మీరు విని ఆనందించండి  మరి....

చిత్రం:  మూగ ప్రేమ
నటి నటులు : వాణిశ్రీ, శోభన్ బాబు 

పాట :  ఈ సంధ్యలో, కెంజయలో
రచన: ఆత్రేయ
స్వరకల్పన: చక్రవర్తి 
గాయని:  పి. సుశీల, S P బాల సుబ్రహ్మణ్యం 

ఈ సంధ్యలో కెంజాయలో
ఈ సంధ్యలో కెంజాయలో  చిరు గాలుల కెరటాలలో    (2)
ఎ మల్లి మరుల్లెల  ఎదబోసేనో ఎ రాజు ఎద లోతు చవి చుసేనో  
హ హ హ హ !! ఈ సంధ్యలో !!  

ఈ మేఘమే రాగ స్వరమో ఆ రాగమే మూగ పదమో  (2)
ఓ...... ఈ చెంగు ఎ వయసు పొంగో ఆ పొంగు ఆపేది ఎవరో
ఎవరో అదెవరో రెప రెప రెప రెప......!! ఈ సంధ్యలో !!

పులకించి  ఒక కన్నె మనసు,  పలకింది తొలి తీపి  పలుకు  (2)
ఓ.... చిలికింది అది లేత  కవిత,  ఒదిగింది తనలోనే మమత
మదిలో మమతలే రిమ ఝిమ రిమ ఝిమ రిమ ఝిమ.....!! ఈ సంధ్యలో !!

నా కళ్ళలో ఇల్లరికము, నా గుండెలో రాచరికము  (2)
ఓ...  నిదేను నిదేను నిజము, నేనుండు నీలో సగము
సగమే  జగముగా కల కల కల కిల కిల కిల !! ఈ సంధ్యలో !!

ఈ పాటలో ఎవైన తప్పులుంటే దయచేసి నాకు చెప్పగలరు. నేను  సరి  చేస్తాను. 


తెలుగు చిత్ర గీతాలు ఆ పాత మధురాలు 
మీ...అనామిక....

Thursday, 8 September 2011

ఆత్మా-పరమాత్మాఆత్మా-పరమాత్మా  అనే శిర్షికలో ఆధ్యాత్మిక విషయాలు, పురాణాలు, వ్రతాలు, పూజలు, మంత్రాలూ, స్తోత్రాలు, శ్లోకాలు, ఆచార వ్యవహారాలూ, కధలు, నీతులు, సుభాషితాలు, ఋషులు మునులు, మహాత్ముల విశేషాలు , వారు మనకి వదిలి వెళ్ళిన అపురూపమైన, అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద , వీటన్నిటి  వెనక ఉన్న Scientific Reasoning, ఇలా ఎన్నో ఎన్నెన్నో... 

నాకు మా అమ్మమ్మ చాల చిన్ననాటే రామాయణ, మహాభారత, భాగవత కథలు, విశేషాలు చక్కగా చెప్పి అందులో రుచి, జిఙ్యాస కలిపించింది. ఇలా చిన్ననాటి నుండి ఉన్న తృష్ణ అంత చదివినా, అన్ని విన్న,  ఎంత  నేర్చుకున్న ఇంకా తెలుసుకోవాలనే  ఉంటుంది. తరువాత నా అదృష్టం కొద్ది మహానుభావులు, గురువులతో, ఙ్ఞానులతో  ఏర్పడిన పరిచయాలు నాకు ఆధ్యాత్మికంగా అంతో ఉన్నతిని ప్రసాదించాయి. ఒక్కొక్కసారి ప్రయాణాలలో అపరిచితులైన తోటి ప్రయాణికుల నుంచికుడా నేను ఎంతో విలువైన విషయాలు నేర్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. 

నాకు తెలిసిన ఈ  కొద్దిపాటి ఙ్ఞానం  మీతో  పంచుకోవాలని నా ఈ ప్రయత్నం....మీరు మెచ్చి ఆదరిస్తారని ఆశ...

In "Atma-Paramatma" I would like to share with you, what ever little knowledge I have about, spirituality, vedic sciences, puranas, vratha-pooja, slokas, mantras, stotras, customs and traditions, great sayings, our great rishis, munis and saints the knowledge they left behind, the scientific reasoning behind our Vedic knowlede and customs and traditions and many more. 

Hope you like my posts and encourage me.

మీ...అనామిక....

Sunday, 4 September 2011

నా యాత్రా విశేషాలుఈ శీర్షికలో నా యాత్ర విశేషాలన్నీ మీతో పంచుకోవాలని నా కోరిక.  గుళ్ళు గోపురాలు, దర్శనీయ ప్రాంతాలు, స్థళ    పురాణం   ఇలా ఎన్నో కబుర్లు చెప్పాలి. మీకు నచ్చుతుందని ఆశిస్తో. 

ఇది ఒంగోలులోని జీవీట్  మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్. దీనిని 1908లో  నిర్మించారు.  అంటే  2008 నాటికీ 100  సంవత్సరాలు. నేను చర్చి లోపలి భాగం సమయాభావం వలన చూడలేక పోయా. మరొక  సారి అవకాశం దొరికితే   తప్పక చూస్తా. 

My Travelogues-under this title I would like to share with you my travel experiences. Hope you like them. 

This is the Jewett Memorial Baptist Church in Ongole-an important land mark in the town. Built in 1908 it's centenary was celebrated in 2008. I did not have time to go inside and see it. May be next time I would be lucky enough to do so.

మీ...అనామిక....

మృతిక్కాభరణాలు-Clay Jewellery

నగలనగానే మనకి బంగారం వెండి రత్నాలు గుర్తుకొస్తాయి. కానీ అంత ఖరీదు లేకుండా కుడా మనం నగలు కొనుక్కోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా?
మట్టితో చేసినవి- అదే నండి బంక మన్నుతో చేసినవి. కానీ మీరు అబ్బే ఎం బాగుంటాయి అని అనవద్దు, ఇవి చూడండి:

ఇది థాయిలాండ్ వారు చేసినది. ముదురు ఆకుపచ్చ రంగు పూసలు మధ్యలో ముదురు  ఆకుపచ్చ, జేగురు రంగు ఆకుల లాకెట్లు. బాగుంది కదా?

ఇది మలేషియా వారు చేసింది. జేగురు రంగు, తెలుపు- మట్టితో చేసిందే. పెద్ద పూసలని రుద్రాక్ష లాగా చేశారు.

ఇవి పెద్ద ఖరీదు లేవు. చూడటానికి బాగున్నాయి. Trendy and fashionable. Ethnic అంటే కలంకారీ లాంటి చీరెలు పంజాబీ డ్రెస్సులకి నప్పుతుంది. సరిపడా చెవి దుద్దులు కూడా ఉంటే బాగుంటాయి.

సరదాగా పార్టీకో ఆఫీసుకో వేసుకోవచ్చు. Teenagersకి ఆయినా ఉద్యొగస్థులకైనా నప్పుతుంది.

ఇలాంటివి ఏ ప్రదర్శనలోనో దొరుకుతాయి. అయితే ఒకే సారి సెట్ మొత్తం దొరకకపోవచ్చు. కొంచం ఓపిక చేసుకుని వెతికితే సెట్ చేసి పెట్టుకోవచ్చు.

నాకైతే ఒక సారి నెక్‌లేస్ ఒక షో లో దొరికితే చెవి దుద్దులు ఇంకొక షో లొనొ లేదా ఏ ప్రదర్శనాలోనో దొరుకుతాయి, అదీ చాలా రోజుల తరువాత. కానీ మన శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది. ఇలాంటివి ధరిస్తే  ప్రత్యేకంగా కనిపించవచ్చు. మీరేమంటారు?

Jewellery need be made of precious metals like gold, silver or gems. It can be made of clay like the one above. these are trendy, fashionable and affordable. usually these are available in exhibitions or shows. This clay jewellery goes well with ethnic dresses or saris.

We may not be able to get the entire set of necklace and ear rings in one go. We need to patiently search for these in more than one place or show. But it is worth it. Don't you think so?

Watch out for more....

మీ...అనామిక....

Friday, 2 September 2011

నగ-నట్ర

నాగలంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఏ పెళ్లికో పేరంటానికో వెళ్ళినా మనమంతా నగలు, చీరెలు గురించి కొంతైనామాట్లాడ కుండా ఉండలేము. అసలు మన సంప్రదాయంలో కట్టు బొట్టుకి చాలా విలువ. మనం అనాది నుండీ చాలా ఉన్నతి చెందిన, నాగరికులమని పశ్చాత్యులు కూడా ఒపుకున్నారు.

అనాది నుండీ ఆడవారు ఎంతో అందంగా అలకరించుకునేవాళ్ళు. వాళ్ల వస్త్రాల గురించీ నగల గురించి, పురాణాలలో, ఇతిహసంలో ఎన్నో ఉదాహరణాలు ఉన్నాయి. సత్యభామ ఏడు వారాల నగలు తులాభార ఘట్టం తో పేరు గడించలేదా.

నా ఈ శీర్షిక ద్వారా నేను నాగలలో వస్తున్న కొత్త trends- designs మీతో పంచుకోవాలని ప్రయత్నం.

మీకు నచ్చి ఆదరిస్తారని  ఆశిస్తూ...

  మీ...అనామిక....