Monday 15 August 2011

మేఘసందేశం


కాళిదాసుని మేఘసందేశం సరే చాల ప్రసిద్ధమైంది. ఈ వర్ష కాలం ఆకాశంలో కదిలే మబ్బులను చుస్తే ఎ ప్రియుడో దూరాన ఉన్న ప్రియురాలికి తన సందేశాన్ని ఈ మేఘాల ద్వారా పంపిస్తున్నాడో  అని అనుకోక మానం.


నేను తీసిన కొన్ని చ్హాయ చిత్రాలు. నాకు డిజిటల్ కెమేరాతో కూడా సరిగ్గా తీయటం రాదు. నా పాండిత్యం అంతే. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.అదీ కాక ఇవి కదిలే వాహనాలలో నుండి తీసినవి. అందుకే అంత బాగా  clear గా కన్పించక పోవచ్చు.


కొన్ని చిత్రాలు మీ కోసం ఈ పోస్ట్ లో 
నీలాల నింగిలో అందాల మేఘమాల
ధరిత్రి హృదయంలో ఆనంద హేల

నదిలో తన ప్రతిబింబం చూసి
అందాల మేఘ మాల మురిసి

కొండలపైనా కోనలలోన 
వాగుల్లోన వంకల్లోన 
కురిపించే  చిరు జల్లు
విరిసే ఏడు రంగుల హరివిల్లు

నేను తెలుగులో కవిత వ్రాయటం ఇదే మొదటి సారి . 

Meeku nachhutundani aasistho ..

Typing in Telugu is really difficult and takes a lot of time. But I still try my best to write as much as possible in Telugu lipi. I just hope that if there are any printer's devils you will forgive me. 


These photographs have been taken from moving vehicles and that too on day when it the sky was overcast heavily and not much light. The photographs are therefore not that clear.

Please leave your comments and suggestions 

మీ...అనామిక....

శుభాకాంక్షలు


అందరికి  స్వాతంత్ర  దినోత్సవ శుభాకాంక్షలు.
ఇవాళ మనమందరమూ 65 వ స్వాతంత్ర  దినోత్సవం  జరుపుకుంటున్నాంచదువుకునే రోజుల్లో, స్కూల్లో రెండు మూడు రోజుల ముందునుండే హడావిడి. తల అదో పదో వేసి, డబ్బు ప్రోగు చేసి, రంగురంగుల కాగితాలతో,  సైన్సు, సోషల్ స్టడీస్  చర్ట్లతో, గాంధీ, నెహ్రు వంటి దేశనాయకుల చిత్రాలతో పోటిపడి అలంకరిం,చి తరగతిని అందంగా పెట్టాలని తెగ శ్రమ పడేవాళ్ళం.  ప్రైజ్ వస్తే సంతోషమే  మే రాకుంటే కొంచం బాధ పడినా అందరం కలసిపోఎవాళ్ళం. 

అదో లోకం, అదో ప్రపంచం. తలచుకుంటే ఆ రోజులే వేరు. మళ్లీ రావుకదా అని బాధ అనిపిస్తుంది. ఆటలు, పాటలు, చదువు, స్నేహితులతో కబుర్లు. ఇల్లు లేకపోతే స్కూలు. ఇప్పట్ల ఇంకా వేరే వ్యాపకాలు లేవు. మంచి మంచి పుస్తకాలు  చదవటం, చిత్రలేఖనం. కుట్లు-అల్లికలు ఇలా కొత్త కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళం.

స్వాతంత్ర  దినోత్సవం  అంటే నాకు మొదటగా  గుర్తొచ్చేది దేశ భక్తీ గీతాలు. ఆ రోజున స్చూల్లో పడేవాళ్ళం. కానీ ఇంట్లో కూడా మా అమ్మ, నాన్న, బామ్మ, తాతగారు  పాడించి ఆనందించేవారు. ఝండా ఊంచా రహే హమారా అన్నా, వందే మాతరం అన్నా, మా తెలుగు తల్లికి మల్లె పూదండా అన్నా చెవికోసుకునే  వారు. ఇలా ఎన్నో  పాటలు... 


నాకు విలున్నప్పుడల్లా నా చిట్టా నుండి కొన్ని గీతాలు గేయాలు మీతో పంచుకుంటాను. 


ఝండా ఊంచా రహే హమారా


శ్యాంలాల్ గుప్తా ప్రసాద్ అనే కవి రచించిన ఝండా ఊంచా రహే హమారా..   


Vijayi vishwa tiranga pyara,
Jhanda ooncha rahen hamara;


Sada shakti sarsane vala, 
prem sudha barsane vala
Veeron ko harshane vala, 
matribhoomi ka tan-man sara;
Vijayi vishwa tiranga pyara,
Jhanda ooncha rahe hamara!!


Aaoo pyare veeron aaoo, 
desh-dharma par bali bali jao
Ek saath sab milkar gaao, 
pyara Bharat desh hamara;
Vijayi vishwa tiranga pyara,
Jhanda ooncha rahe hamara!!


Shaan na iski jaane paaye, 
chaahe jaan bale hi jaaye
Satya ki vijay kar dikhlaye, 
tab hove pran poorn hamara
Vijayi vishwa tiranga pyara,

విజయి  విశ్వా  తిరంగా  ప్యారా  ,    
ఝండా  ఊంచా  రహే   హమారా  
సదా శక్తి సరసనే వాలా ,
ప్రేమ సుధా బర్సానే వాలా
వీరోం కే హర్షానే వాలా ,
మాతృ భూమి కా తన్ -మన్ సారా ;
విజయి విశ్వా తిరంగా ప్యారా , 
ఝండా ఊంచా రహే హమారా

ఆవో ప్యారే వీరో ఆవో,
దేశ్ -ధర్మ పర బలి బలి జావో
ఎక్ సాథ్ సబ్ మిల్కర్ గావో ,
ప్యారా భారత్ దేశ్ హమారా ;
విజయి విశ్వా తిరంగా ప్యారా ,
ఝండా ఊంచా రహే హమారా

షాన్  న  ఇస్కి  జానే  పాయె ,
చాహే  జాన్  భలే  హీ  జాయే
సత్య  కి  విజయ్  కర్  దిక్హ్లాయే ,
తబ్  హోవే  ప్రాణ  పూరన్  హమారా 
విజయి విశ్వా తిరంగా ప్యారా ,
ఝండా ఊంచా రహే హమారా!



మీ...అనామిక....

Wednesday 3 August 2011

కుట్లు-అల్లికలు

నేర్చుకోండి నాతో..


నాకు హస్త కళలంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అమ్మకి అమ్మమకి బాగా వచ్చు. వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నా. తీరిక సమయంలో వచ్చిన వాటిలో రకరకాలుగా ప్రయోగాలు చేయటమే కాదు కొత్తవి నేర్చుకుంటో ఉంటాను. ఈ కళలలో నాది self education. 


మనసు బాగుండక పోయిన కాసేపు ఏదో ఒకటి చేస్తే ఇట్టే మర్చిపోతాము. 

నాకు వచ్చినవి, నేను చేసిన ప్రయోగాలు మీతో పంచుకోవాలని ఈ శీర్షిక ప్రారంభిస్తున్నా. నేను regularగా వ్రాయలేకపోయినా వీలైనంతవరకు క్రమం తప్పకుండా post చేయటానికి ప్రయత్నం చేస్తా.

నేను కుట్టిన కొన్ని రకాల కూట్ట్లు

వచ్చే పోస్ట్ నుండి రకరకాల కుట్లు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండండి.....


మీ...అనామిక....

రంగవల్లి-1

పద్మాల ముగ్గు


మన భారతీయ సాంప్రదాయంలో రంగవల్లికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఉత్తరాదిన శుభకార్యాలకి మాత్రమే వేసినా మన దక్షిణాదిన రోజూ వేయవలసిందే. అందునా మన తెలుగువారు సంక్రాంతి పండగకి  నెల రోజుల ముందు నుండే  ముగ్గులు వేస్తాం. తమిళులు కూడా అంతే.

శ్రావణ మాసం వ్రతాలు చేస్తాంగా, ఇల్లు చక్కగా శుభ్రపరచి, ఇంటి ముందు, వీలైతే ఇంట్లోనూ రంగు రంగుల రంగవల్లికలు తీర్చి దిద్దుతే అందంగా ఉంటుంది.


లక్ష్మి దేవికి పద్మాలు అంటే ఇష్టం. అందుకని కొన్ని పద్మాల ముగ్గులు..
                       పద్మాల ముగ్గు



ముందుగా 14X14 చుక్కలు పెట్టుకుని పైన చూపిన విధంగా కలుపుకోవాలి.


మరికొన్ని రాబోయే టపాలలో..


మీ...అనామిక....

Tuesday 2 August 2011

ముద్ద మందారం ....

ముద్ద మందారం....ముగ్ద సింగారం....



ముద్దుకే ముద్డొచే మందారం ముద్ద మందారం ముగ్ధ సింగారం....

మా తోటలో పూసిన పువ్వు. వాన దేవుడు కరుణించి వానలు బాగా కురిపిస్తుండటంతో ఇలా మందారాలు కనువిందు చేస్తున్నాయి.




మీ...అనామిక....