Sunday 31 July 2011

మీ కోసం .....


సఖులందరికి స్వాగతం....


నాకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అంటే ఎనలేని అభిమానం. వాటిని కొంతైనా కాపాడి ముందు తరాలవారికి అందిద్దామన్న తపన. పదహరణాల తెలుగింటి అమ్మాయైనా ఇతర ప్రాంతాల సంస్కృతులనూ గౌరవించి, అందులోని మంచిని గ్రహించి పాటించే తత్వం. 

కుట్లు-అల్లికలు, హస్త-కళలు, లలిత-కళలు, వంట-వార్పూ-వీటిల్లో వీలున్నప్పుడల్లా ఏదైనా కొత్తగా సృష్టించాలని ఆశ. నాకు తెలిసినది కొంతే ఐనా ఇతరులతో పంచుకోవాలన్న అభిలాష. 

ఇలా బ్లోగ్ ఆరంభిదామని ఎప్పటి నించో ఒక కోరిక. తీర మొదలు పెట్టాక నిర్వహించ గలనా అన్న సంశయం. కానీ నాకు తెలిసింది అందరితో పంచుకుంటే, వారికి నాకు ఆనందమేగా. విద్యను పంచితేనే పెరుగుతుంది. 

అమ్మ, అమ్మమ్మ, బామ్మ, అత్తలు, పిన్నులు, పక్కింటి పిన్నిగార్లు ఇలా చాలా మంది నుంచి నేర్చుకున్న ముగ్గులు, వంటలు, కుట్లు-అల్లికలు, చిట్కాలు, కథలు-ఇలా ఎన్నో ఎన్నెనో మీతో పంచుకోవాలానీ, సరదాగా కబుర్లు చెప్పాలని.....

వెరసి ఈ ప్రయత్నం....

ఇలా ఈ శ్రావణ మాసంలో సఖులకి ఈ మీ సఖి చిరు కానుక.

మీరు ఈ బ్లొగ్ని చదివి ఆనందిస్తారని, కొత్త సంగతులు నేర్చుకుంటారని, నన్నూ నా బ్లోగ్ ని ఆదరిస్తారని ఆశిస్తూ...

శ్రావణ మాసంలో మీ అందరికి శుభములు చేకూరాలని ....





మీ...అనామిక....